దసరా చిత్రాలతో విజయ్ దేవరకొండ.!

దసరా చిత్రాలతో విజయ్ దేవరకొండ.!
Cinema News

మన టాలీవుడ్ మూవీ దగ్గర బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్స్ లో సంక్రాంతి ఆ తరువాత విజయ దశమి, దసరా రేస్ లే పెద్దవి అని చెప్పాలి. మరి వాటిలో ఆల్రెడీ ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ ఫెస్టివల్ సంక్రాంతికి సెన్సేషనల్ హిట్స్ రాగా ఈ నెక్స్ట్ అయితే దసరా కానుకగా మూవీ లవర్స్ కి అయితే ఇప్పుడు ఫీస్ట్ వచ్చింది. ఇక ఈ భారీ రేస్ లో మొత్తం మూడు సాలిడ్ సినిమాలు వస్తుండగా ఈ మూడింటి తో పాటుగా మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రాబోతున్నట్టుగా తెలుస్తోంది .

దసరా చిత్రాలతో విజయ్ దేవరకొండ.!
Vijay Devarakonda

విజయ్ 13వ చిత్రం దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్ చేస్తున్న రెండో సినిమా “ఫ్యామిలీ స్టార్” నుంచి నిన్ననే ఇంట్రెస్టింగ్ టైటిల్ వీడియో రాగా దీనికి అదిరే రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ వీడియోని అయితే ఇప్పుడు దసరా రిలీజ్ చిత్రాలు “భగవంత్ కేసరి” అలాగే “టైగర్ నాగేశ్వరరావు” సహా “లియో” సినిమా లతో అటాచ్ చేసి రాబోతుంది అని తెలుస్తోంది. దీనితో మూవీ రీచ్ కి ఇది మంచి ప్లానింగ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది బిగ్ మూవీ ఫెస్టివల్ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.