ప్రముఖ రిటైల్ చైన్ స్టోర్ దిగ్గజం విజయ్ సేల్స్ యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది.ఈ తగ్గింపులు యాపిల్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులకు ఆయా యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ సేల్ ఏప్రిల్ 15 నుంచి మొదలవ్వగా.. ఏప్రిల్ 21 వరకు ఈ సేల్ కొనసాగనుంది.
ఈ సేల్ లో భాగంగా iPhone SE , iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 11, iPhone 12 స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై డిస్కౌంట్, ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు కూడా రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చును. ఈ ఆఫర్లు అన్ని విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్స్, ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.