శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్కు సంబంధించి అప్డేట్ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు.
టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. వన్డేల్లో మురళీ 534 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ బయోపిక్ చిత్రానికి ‘800’ అని పెరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి మురలీధరన్ బౌలింగ్ శైలీని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడట. మరలీధరన్ పాత్రతో విజయ్ పక్కాగా మెప్పిస్తాడని నిర్మాతలు భావిస్తున్నారు. మురళీధరన్ బయోపిక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.