ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాబ్ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందన్నారు. జాబ్ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
జాబ్‌మేళాకు 1.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రేపు 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులందరికీ అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. టీడీపీ కుల పార్టీ అని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు.