Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందూ సంస్థగా, మతతత్వ పార్టీగా ముద్రపడిన రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంస్థ ప్రస్తుత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. కేంద్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసిన బీజేపీకి గురువు పార్టీ ఆర్ఎస్ఎస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ త్వరలోనే ఆర్ఎస్ఎస్పై ఒక చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. అందుకు ప్రముఖ నాయకులు ముందడుగు వేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ చరిత్రతో ఒక చిత్రాన్ని చేయాలని భావించిన నాయకులు అందుకు గాను కథను సిద్దం చేయాల్సిందిగా బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. అందుకు గాను భారీ పారితోషికంను కూడా వారు ఆఫర్ చేశారట. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చరిత్రను తెలుసుకునే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు. చరిత్రకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడివ్వడంతో పాటు, ఆకట్టుకునే కథా నేపథ్యంను తయారు చేయాలని విజయేంద్ర ప్రసాద్‌కు సదరు నాయకులు సూచించారట. ‘బాహుబలి’తో పాటు పలు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ గొప్పదనంను తెలియజేసేలా ఒక మంచి కథను అందిస్తాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలోని అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.