మాల్యా దగ్గర 150 కోట్లు విరాళం తీసుకున్నచంద్రబాబు !

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్ది రోజులుగా జగన్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

మొన్నటికి మొన్న చంద్రబాబు ని జైలుకి పంపడమే తన లక్ష్యం అని ప్రకటించిన ఆయన ఈరోజు చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల అప్పులు తీసుకొని బ్యాంకులని బురిడీ కొట్టించి లండన్‌కు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాతో చంద్రబాబుకు సంబంధాలున్నాయని విజయ సాయి ఆరోపించారు. 2016 మార్చి 12, 13, 14వ తేదీల్లో విజయ్ మాల్యాను చంద్రబాబు లండన్ వెళ్లి కలిశారని, ఆయన్ని ఎందుకు కలిశారో చెప్పాలని ప్రశ్నించారు.

పార్టీ విరాళం కోసం రూ.150 కోట్ల తీసుకున్నారని, ఈ విరాళంపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. దీనికి చంద్రబాబు జవాబు ఇవ్వకపోతే ఇవన్నీ వాస్తవాలేనని ఒప్పుకున్నట్టే అని అనుకోవాల్సి వస్తుంది అని విజయ సాయి రెడ్డి అన్నారు. ఈరోజు రాజ్యసభ వాయిదా అనంతరం పార్లమెంటు ఆవరణలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘దుర్మార్గపు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలను గత నాలుగు సంవత్సరాలుగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి, యూటర్న్ అంకుల్‌గా పిలవడబడుతున్న ముఖ్యమంత్రి రేపు ఢిల్లీకి వస్తున్నారని విన్నా’ అంటూ చంద్రబాబుపై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజీపీ మరొక భాగస్వామిని వెతుక్కోవడానికి చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదని ఆరోపించారు. సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు.