బన్నీ అతికి విక్రమ్‌కు విసుకు వచ్చిందట!

Director Vikram Kumar Seroins On Alluarjun

అల్లు అర్జున్‌ వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న సమయంలో ‘నా పేరు సూర్య’ చిత్రం ఆయన జోరుకు బ్రేక్‌లు వేసింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య చిత్రం దారుణంగా ఫ్లాప్‌ అయ్యింది. చాలా కష్టపడి ఆర్మీ సోల్జర్‌ పాత్రలో అల్లు అర్జున్‌ నటించి మెప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. స్టైలిష్‌ లుక్‌తో పాటు, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో బన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాని సాధ్యం కాలేదు. అల్లు అర్జున్‌ నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో తర్వాత సినిమా గురించి కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఆ చిత్రం సక్సెస్‌ అయ్యి ఉంటే బన్నీ కొత్త సినిమా అప్పుడే ప్రారంభం అయ్యి ముగింపు దశకు చేరుకునేది. కాని కథ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

బన్నీ తర్వాత సినిమాను తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. గత ఆరు నెలలుగా వీరిద్దరి మద్య కథా చర్చలు జరుగుతున్నాయి. మొదట కథకు ఓకే చెప్పిన బన్నీ ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలైన తర్వాత కథలో మార్పులు చేర్పులు చెబుతూ వచ్చాడు. మొదట సెకండ్‌ హాఫ్‌ వరకు మార్చుకుని రావాల్సిందిగా కోరిన బన్నీ ఆ తర్వాత మళ్లీ మళ్లీ మార్పులు చెప్పడంతో విక్రమ్‌ కుమార్‌కు విసుగు వచ్చి ప్రాజెక్ట్‌ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు తనతో సినిమా చేయడం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా తన స్క్రిప్ట్‌కు మళ్లీ మళ్లీ మార్పులు చెబుతున్నాడేమో అంటూ దర్శకుడు విక్రమ్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. బన్నీతో కాదని ప్రస్తుతం ఒక తమిళ హీరోతో సినిమా చేయాలని విక్రమ్‌ కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు బన్నీ ఏం చేస్తాడనేది చూడాలి.