వీరమల్లు కొత్త షెడ్యూల్‌.?

వీరమల్లు కొత్త షెడ్యూల్‌.?
వీరమల్లు

ప్రస్తుతం అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌ చేతినిండా సినిమాలున్నాయి. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ‘ఓజీ’ చిత్రాల షూటింగ్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ గ్లింప్స్‌కు భారీగా అయితే స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షెడ్యూల్‌ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. జూన్‌ మొదటివారం నుంచి ‘హరిహరవీరమల్లు’ సినిమా కోసం పవన్‌కల్యాణ్‌ డేట్స్‌ కేటాయించారని తెలిసింది.

ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. మొఘల్‌ కాలం నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ అన్యాయాలపై తిరగబడే బందిపోటు పాత్రలో అయితే కనిపించనున్నారు.