ఏప్రిల్ 20నుంచి 28రోజులు లాక్ డౌన్ అంటూ పోస్ట్ వైరల్

ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు తమ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్ కట్టడికి పలు మార్గ నిర్దేశాలను చేసినట్లుగా ఉన్న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ ప్రచారమౌతుంది. లాక్ డౌన్ ఈ రకంగా నిర్వహించగలిగితే కరోనా మహమ్మారి నుంచి బయట పడవచ్చని సూచించినట్లు అందులో ఉంది.

అదేమంటే… మొదటగా ఒకరోజు ను లాక్ డౌన్ ను ట్రైల్ రన్ గా పాటించడం, ఆ తర్వాత స్టెప్ 2లో 21రోజులు లాక్ డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత స్టెప్ 3లో 28 రోజులు లాక్ డౌన్ విధించడం, ఆ తర్వాత 5రోజులు మినహాయించి తిరిగి కరోనా స్థాయిని తీవ్రతను బట్టి తిరిగి స్టెప్ 4లో 15రోజులు లాక్ డౌన్ విధించడం వంటివి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్లు పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే ఇండియా ఇదే విధానాన్ని అనుసరిస్తుందని.. లాక్ డౌన్ ట్రైల్ రన్ గా మార్చి 22న జనతా కర్ప్యూ పేరుతో విధించగా.. ఆ తర్వాత మార్చి 24నుంచి ఏప్రిల్ 14వరకు మొదటి లాక్ డౌన్ ను విధించింది. ఆ తర్వాత ఏప్రిల్ 15నుంచి 19వ తేదీ వరకు లాక్ డౌన్ నుంచి మినహాయించి, తిరిగి ఏప్రిల్ 20 నుంచి మే 18వ తేదీ వరకు రెండవ సారి లాక్ డౌన్ ను విధించనుందనేది ఆ పోస్ట్ లో వివరంగా స్పష్టం చేసింది.

అదేవిధంగా అప్పటికి కరోనా తీవ్రతను బట్టి లాక్ డౌన్ విధించాలా? వద్దా? అనే విషయాన్ని చర్చించి నిర్ణయిస్తారు. ఒకవేళ అప్పటికి జీరో కేసులు నమోదైతే.. లాక్ డౌన్ ఉండదు. ఇంకా కేసులు నమోదౌతుంటే… తిరిగి మే 25నుంచి జూన్ 10వ తేదీవరకు 15రోజుల పాటు పైనల్ లాక్ డౌన్ విధించనుంది భారత్ అన్నట్లుగా పోస్ట్ లో విధివిధానాలు స్పష్టం చేసేలా తెలిపింది. మొత్తానికి ఈ ప్రకటణ నిజంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కరోనా కేసుల తీవ్రత మీదనే ఈ లాక్ డౌన్ నిర్ణయం ఆధారపడి ఉందనేది స్పష్టమౌతున్న విషయంగా చెప్పవచ్చు.