దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆట నాలుగో రోజు గాయం కారణంగా ఫీల్డ్‌లోకి ఆలస్యంగా వచ్చిన బుమ్రా రెండు కీలక మైన వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్‌తో కలిసి 40పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ సమయంలో బౌలింగ్ వచ్చిన బుమ్రా.. వాన్ డెర్ డస్సెన్‌ని క్లీన్ బౌల్డ్ చేసి భాగాస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ని ఔట్ చేయడానికి కోహ్లి వ్యూహలను రచిస్తోన్నాడు. బౌలింగ్ చేస్తున్న బుమ్రాకు కోహ్లి పలు సూచనలు చేశాడు. ఎల్గర్‌కు రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేయమని కోహ్లి సూచించాడు. పిచ్‌పై పగుల్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోమని కోహ్లి బుమ్రాకు సలహా ఇచ్చాడు. వెంటనే బుమ్రా తన పొజిషన్ మార్చుకుని రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ విజయానికి 6వికెట్ల దూరంలో ఉంది. 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్‌ఆఫ్రికా 4వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.