విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటన

virat kohli trailer

టీం ఇండియా సంచలనం, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తాను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ సంచలన ప్రకటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపింది. ఇప్పటి వరకు యాడ్స్‌లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరాట్‌ కోహ్లీ మొదటి సారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను వివాహం చేసుకున్న తర్వాత కోహ్లీలో హీరో కావానే ఆకాంక్ష ఎక్కువ అయినట్లుంది. అందుకే ఒక వైపు క్రికెట్‌తో చాలా బిజీగా ఉన్నా కూడా హీరోగా సినిమా చేశాడు.

virat kohli Trailer Movie First Look

విరాట్‌ కోహ్లీ ‘ట్రైలర్‌’ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇదే నెలలో విడుదల చేయబోతున్నారు. విరాట్‌ కోహ్లీ ట్విట్టర్‌ ద్వారా తన సినీ రంగ ప్రవేశంపై ప్రకటన చేశాడు. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇన్నాళ్లు నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నా, పది సంవత్సరాల తర్వాత కొత్త రంగంలో అడుగు పెట్టబోతున్నట్లుగా కోహ్లీ పేర్కొన్నాడు. మొత్తానికి కోహ్లీ హీరోగా రాబోతున్నట్లుగా వచ్చిన ప్రకటన వైరల్‌ అయ్యింది. కోహ్లీ ఒక వైపు క్రికెటర్‌గా అంత బిజీగా ఉండగా ఎలా హీరోగా నటించాడు అంటూ కొందరు అంటున్నారు. ‘ట్రైలర్‌’ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.