జోను ప్రకటించేనా ?

Visakha Railway Zone To Be Announced Soon

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కు లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని.. వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కోన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు వాల్తేర్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి జోన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల ఏపీ భాజపా నేతలు కూడా పీయూష్‌ గోయల్‌ ను కలిసి రైల్వేజోన్‌ మీద ప్రకటన చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు నేతలు కలసి పీయూష్‌ గోయల్‌కు వినతిపత్రం సమర్పించారు. పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే మార్చి ఒకటో తేదీన ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఉన్న నేపథ్యంలో.. అదే రోజున విశాఖ సాక్షిగా మోదీ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి ఈ జోను అంశం ఇంకేని రోజులు నానుస్తారో ?