దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా యంగ్ హీరో విశాల్ కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. తన నాన్నకు కరోనా సోకిందని, నాన్నకు సహాయపడటం ద్వారా జ్వరం, జలుబు, దగ్గు ఉన్నాయని తన మేనేజర్‌కి కూడా అదే లక్షణాలు ఉన్నట్టు తెలిపాడు. అయితే ప్రస్తుతం వారంతా ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నారని, ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడతాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్వీట్ చేశాడు.