వైసీపీ టికెట్ కోసం విష్ణు కర్చీఫ్.

Vishnu Kumar Raju comments on YSRCP MLAs who joined TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
విష్ణుకుమార్ రాజు… ఈయన అవ్వడానికి బీజేపీ ఎమ్మెల్యే. ఆంధ్ర అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి అధికార, విపక్షాల మధ్య దౌత్యవేత్త పాత్ర పోషిస్తారు. ఒక్కసారి అధికార పార్టీ మీద విమర్శలు చేస్తారు. ఇంకోసారి ప్రతిపక్షం రోల్ బాగా లేదంటారు. ఇక టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన బీజేపీ విధానాల మీద కూడా అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఊపుగా వున్న రోజుల్లో ఇంటిలో భార్యకే సమాధానం చెప్పలేకపోతున్నానని విష్ణు కుమార్ రాజు చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి. ఆయన ఇప్పుడు తాజాగా చేసిన కామెంట్స్ కూడా అంతే హాట్ టాపిక్ గా మారాయి. PAC సమావేశం సందర్భంగా ఆయన వైసీపీ నుంచి వచ్చి ఏపీ క్యాబినెట్ లో మంత్రులు అయిన వాళ్ళ మీద ఎటాక్ చేశారు. వారిని మంత్రివర్గంలో కొనసాగించడం మంచిది కాదని, వెంటనే వాళ్ళు వైసీపీ తో వచ్చిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విష్ణు కుమార్ రాజు ఈ విధంగా గొంతెత్తడం కొత్త కాకపోయినా ఈసారి మాటల్లో వాడివేడి చూస్తుంటే కాస్త ఆశ్చర్యంగానే వుంది. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడుతున్నారేమోనని డౌట్ గా వుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, టీడీపీ పొత్తు సందేహాస్పదంగా వున్న తరుణంలో సొంత పార్టీ టికెట్ వచ్చినా ప్రయోజనం లేదని విష్ణుకు బాగా తెలుసు. అందుకే వైసీపీ ని ప్రసన్నం చేసుకోడానికి విష్ణు ఇలా మాట్లాడినట్టు గట్టిగా వినిపిస్తున్న మాట. ఒక బీజేపీ నేత అయితే ఆ దగ్గరే విష్ణు వైసీపీ టికెట్ కోసం కర్చీఫ్ వేసాడని అనడం మీడియా దృష్టిలో కూడా పడింది.