తిరుమలలో మొబైల్ ఆడియో సిస్టమ్‌…

Mobile audio System in Tirumala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తిరుమల రథసప్తమి పర్వదినం సందర్భంగా బుధవారం తిరుమల శ్రీవారి సప్తవాహనాలముందు కళాబృందాల కళాప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మ ప్రచర పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుకు చెందిన 50 కళా బృందాలలో దాదాపు 1000 మంది కళాకారులు, స్వామివారి వాహనసేవలలో స్వామివారి ముందు తిరుమాడ వీధులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో భజనలు, కోలాటాలు, వివిధ దేవతామూర్తుల అలంకారాలు, వివిధ రకాల వాయిద్యాలతో కళాకారులు భక్తులలో మరింతగా భవాన్ని పెంచాయి.

తిరుమలలో మొదటిసారిగా కళాబృందాలకు మొబైల్‌ ఆడియో సిస్టమ్‌

Mobile audio System in Tirumala

శ్రీవారి వాహనసేవల ముందు ప్రదర్శనలిచ్చే కళాకారులకోసం తిరుమలలో మొదటి సారిగా మొబైల్‌ ఆడియో సిస్టమ్‌ను టిటిడి అందిబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కళాకారులో తమతోపాటు తీసుకు వచ్చే ఆడియో సిస్టమ్‌ సంగాత శబ్దాల్లో మారులు ఉండేవి, దీని అధికమించేందుకు టి.టి.డి మొబైల్‌ ఆడియో సిస్టమ్‌ను భజన బృఞదాలకు అందింస్తుంది. దీనిని రథసప్తమి సందర్భంగా ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈ ఆడియో సిస్టమ్‌కు భజన బృందాలు, భక్తుల నుండి వచ్చే స్పందనను బట్టి రాబోవు బ్రహోత్సవాలలో కళాకారులకు అందివ్వనున్నారు. కాగా ఇందులో మైకు, ఆంప్లిఫైర్‌, బ్లూటూత్‌, పెన్‌ డ్రైవ్‌, 40వాల్టు ఇన్‌బిల్ట్‌ స్పీకర్లు కలిగి ఉంటాయి. ఇందులో 40వాట్‌ల స్పీకర్లను ఉపయోగించడం వలన సంగీతం వినడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది.

Mobile audio System in Tirumala (2)