‘జరగండి’ సాంగ్ తో ‘గేమ్ ఛేంజర్’: చరణ్ ఫ్యాన్స్ కు ఊరించే పాట!

'Game changer' with 'Jaragandi' song: Charan's song to cheer up fans!
'Game changer' with 'Jaragandi' song: Charan's song to cheer up fans!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్– బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కలిసి నటిస్తున్న రెండో మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దరశకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను ఇవాళ చిత్ర బృందం విడుదల చేసింది. మార్చి 27వ తేదీన హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ‘జరగండి’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చెర్రీ, హీరోయిన్ కియారాతో స్టెప్పులు బాగా అదరగొట్టేశారు.

'Game changer' with 'Jaragandi' song: Charan's song to cheer up fans!c
‘Game changer’ with ‘Jaragandi’ song: Charan’s song to cheer up fans!c

ఈ పాటని దలేర్ మహందీ, సునిధీ చౌహాన్ పాడగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ మూవీ కు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. రామ్చరణ్కు బర్త్ డే విషెస్ చెప్తూ, సాంగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు . మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కూడా చేశారు.