రామ్ చరణ్ యాక్షన్ లోకి దిగితే ఏం జరుగుతుంది?

రామ్ చరణ్ యాక్షన్ లోకి దిగితే ఏం జరుగుతుంది?
Cinema News

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ మరియు అంజలి లు హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా శంకర్ మూవీ షూటింగ్ ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి ఒక టాక్ ఉంది.

రామ్ చరణ్ యాక్షన్ లోకి దిగితే ఏం జరుగుతుంది?
Ram Charan

మరి ఈ సీక్వెన్స్ ను ఈరోజు రామ్ చరణ్ తో శంకర్ స్టార్ట్ చేశారు. దీనితో రామ్ చరణ్ కొంత కాలం టాకీ పార్ట్ తర్వాత సాలిడ్ యాక్షన్ లోకి దిగాడని చెప్పాలి. మరి శంకర్ మార్క్ లో ఈ సీక్వెన్స్ లు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ భారీమూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ మూవీ గా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.