AP Politics: అమరావతి వెళ్లిపోయిన RBI.. ఇక విశాఖలోనే..!

AP Politics: RBI left Amaravati.. Now in Visakha..!
AP Politics: RBI left Amaravati.. Now in Visakha..!

ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో కార్యాలయము నివాసాలకు 11 ఎకరాల భూములను గత ప్రభుత్వం కేటాయించిన రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయము మాత్రం అక్కడ కాకుండా విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి రావడమే తడువుగా అమరావతి విధ్వంసానికి తగ్గబడ్డ వైసిపి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని చిట్యాల వీళ్ళ మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మోకాలు అడ్డుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్రానికి మధ్యలో రాజధాని ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండాల్సిన RBI ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంకి తరలిస్తోంది.

30 వేల నుంచి 35వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాలను గుర్తించాలని అక్కడ జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇటీవలే లేఖ రాశారు. మరుగుదొడ్లు, తాగునీరు, అంతర్గత పార్కింగ్, రెండు లిఫ్టులు, విద్యుత్ కనెక్షన్, ఇంటర్నెట్, కౌంటర్లు తదితర వసతులతో ఐదేళ్ల కాలానికి అద్దె ప్రాతిపదికన ఎంపిక చేయాలని అందులో సూచించారు. విశాఖలో అనువైన భవనాలను గుర్తించి తెలియజేస్తే తమ బృందం పరిశీలిస్తుందని ఆర్బిఐ ప్రాంతీయ డైరెక్టర్ రాసిన లేఖను ఉటంకించారు. 22 ఆగస్టు 22 నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయము పనిచేస్తుంది. అంతకుముందే గత ప్రభుత్వము 2016 లోనే అమరావతిలో RBI కార్యాలయం నివాస సముదాయాల ఏర్పాటకు 11 ఎకరాల భూములను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటే ఆర్బిఐ కి కూడా అప్పట్లో నిర్ణీత ధరపై 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టి వైసిపి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను నిలిపివేసింది.