ఏ బిగ్‌బాస్ షోలో అయినా రోజులు, వారాలు గడిచేకొద్దీ గొడవలవుతుంటాయి. కానీ తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో మాత్రం మొదటివారమే కొట్లాటలతో కొనసాగింది. రెండోవారం ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. మూడోవారానికి వచ్చేసరికి ఒక వ్యక్తి క్యారెక్టర్‌కే మచ్చ తెచ్చేలా మాట్లాడారు. వినోదం ఏమో కానీ కలహాలతోనే కాలక్షేపం చేస్తున్నారు కంటెస్టెంట్లు.
అందుకే బిగ్‌బాస్ షోకు సరికొత్త రంగులు అద్దేందుకు త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందంటూ గతకొంత కాలంగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే! ఒక లేడీ యాంకర్‌ను రంగంలోకి దింపుతున్నారంటూ నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ లేడీ యాంకర్ ఎవరో కాదు, విష్ణుప్రియ అని సోషల్ మీడియాలో సరికొత్త బజ్ వినిపిస్తోంది. త్వరలో విష్ణుప్రియ బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమయ్యే అవకాశమే లేదు.
ఎందుకంటే తనకు బిగ్‌బాస్ కాన్సెప్టే నచ్చదని ఎన్నోసార్లు బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది విష్ణుప్రియ. ఎన్ని కోట్లు ఇస్తానన్నా, ఎన్ని సీజన్ల నుంచి పిలుపు వచ్చినా షోలో ఎంట్రీ ఇచ్చేదే లేదని పలు ఇంటర్వ్యూల్లో కుండ బద్ధలు కొట్టి చెప్పేసింది. అలాంటిది విష్ణుప్రియ షోలోకి రావడం కేవలం అపోహ అంటున్నారు ఆమె అభిమానులు. బిగ్‌బాస్ అంటేనే గిట్టదన్న విష్ణుప్రియ షోలో పాల్గొనే అవకాశమే లేదని బల్లగుద్ది చెప్తున్నారు. మరి నిజంగానే విష్ణుప్రియ తన మాటమీద నిలబడుతుందా? లేదంటే కళ్లు చెదిరే ఆఫర్ ఇస్తే షోలో ఎంట్రీ ఇస్తుందా? అన్నది చూడాలి!