నేను ఎవరిని కించపరచలేదు : విశ్వక్ సేన్

నేను ఎవరిని కించపరచలేదు : విశ్వక్ సేన్

యువ హీరో విశ్వక్ సేన్ ఇన్ స్టా గ్రామ్‌లో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఉప్పర సంఘం వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా మాట జారడంతో ఆయా సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా తాను కావాలని వాళ్లను ఉద్దేశించి ఆ మాట అనలేదు అంటూ.. ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాట తిట్టాల్సి వచ్చిందో వివరిస్తూ ఉప్పర సంఘం వాళ్లకు క్షమాపణలు తెలియజేస్తూ వీడియో వదిలారు విశ్వక్ సేన్.

‘నమస్తే.. అందరూ ఇంట్లో ఉన్నారని అనుకుంటా.. కర్ఫ్యూ సందర్భంగా 9 గంటల వరకూ లోపలే ఉండాలని అంటే.. 5 గంటలకు రోడ్లు మీదికి వచ్చి తిరగడం జరిగింది. ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. మెడికల్ ఎమర్జెన్సీ కాదు.. ఇందులో అందరూ భాగస్వామ్యం అవుతూ.. మన రెస్పాన్సిబిలిటీ చూపించాలి. కాని ఎవరికి నచ్చినట్టు వాళ్లు 5 గంటలకే ఇళ్ల బయటకు వచ్చేసి హంగామా చేశారు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. వాళ్లపై కోప్పడుతూ నా ఇన్ స్టార్ గ్రామ్‌లో వీడియో పెట్టడం జరిగింది. ఆవేశంలో నేను ఒక పదం వాడటం జరిగింది.. అయితే ఆ మాట అన్నది నేను ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలని కాదు. ఎవర్నీ ఉద్దేశించి అన్న మాట కాదు.. ఆ సందర్భం ప్రకారంలో ఆవేశంలో అన్న మాటే తప్పితే ఒక వర్గాన్ని కులాన్ని అనాలనేది నా ఉద్దేశం కాదు. నా నోటి నుంచి మాట జారింది.. దయచేసి క్షమించండి అని అన్నారు