టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఈ వైరస్ కార్చిచ్చులా వ్యాపిస్తుండటం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కు ధరించండి, జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు.
ఈ ట్వీట్‌పై ఆయన అభిమానులు స్పందిస్తూ.. ఇది ఒమిక్రాన్ అయితే కాదు కదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మధ్యే ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ ‘ఓరి దేవుడా’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలు చేస్తున్నాడు.