విశ్వక్ సేన్ “మెకానిక్ రాకీ”రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కు టైమ్ ఫిక్స్!

Vishwak Sen's "Mechanic Rocky" release date announcement time fixed!
Vishwak Sen's "Mechanic Rocky" release date announcement time fixed!

టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చివరిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కనిపించారు . ఇది దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. తదుపరి దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే మూవీ ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణ దశలో ఉన్నది . ఈ మూవీ కి సంబందించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక అప్డేట్ ను ఆడియెన్స్ కి అందించడం జరిగింది.

Vishwak Sen's "Mechanic Rocky" release date announcement time fixed!
Vishwak Sen’s “Mechanic Rocky” release date announcement time fixed!

రేపు సాయంత్రం 5:05 గంటలకు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, జేక్స్ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తో పాటుగా విశ్వక్ సేన్ మరికొన్ని మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.