Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : అజిత్, కాజల్, వివేక్ ఒబెరై, అక్షర హసన్
నిర్మాత : సత్య జ్యోతి ఫిల్మ్స్
దర్శకత్వం : శివ
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్
ట్రైలర్ తో అంతర్జాతీయ స్థాయి సినిమా చూస్తున్నంత ఫీలింగ్ తెప్పించిన సినిమా వివేకం. ఇక హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన వీరం, వేదాళం సినిమాలలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ గా నిలవడంతో తాజాగా వివేకం మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు వివేకం ఉందో, లేదో చూద్దామా! .
కథ…
టెర్రరిస్ట్ ల ఆట కట్టించే ఓ అధికారుల బృందం ఒకప్పుడు తమకు బాస్ గా వ్యవహరించి శత్రువుల గుండెల్లో దడ పుట్టించిన అతన్ని పట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్నదే ఈ చిత్ర కథ… ఓ హీరో ఓరియెంటెడ్ సినిమా కథ ఎలా ఉండాలో అలాగే వుంది వివేగం. కథ మొత్తం హీరో అజిత్ చుట్టూ తిరుగుతుంది. అజయ్ కుమార్ (అజిత్) ఒకప్పుడు కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ కి హెడ్. అతని ఆధ్వర్యంలో ఆ ఇంటలిజెన్స్ టీం ఓ మారణ హోమం నుంచి దేశాన్ని బయటపడేస్తుంది. నటాషా అనే తెలివైన హ్యాకర్ ని పట్టుకోవడం కోసం ఆ టీం ఎంతో కష్టపడుతుంది. దాని వల్ల కృత్రిమ భూకంపాలు సృష్టించాలన్న తీవ్రవాదుల కుట్ర భగ్నం అవుతుంది. ఈ క్రమంలో ఓ అనుకోని మలుపు అజయ్ కుమార్ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అతని తో పాటు గర్భవతి అయిన అతని భార్య కూడా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఓ వైపు అణు ఆయుధానికి తీవ్ర వాదుల ప్రయత్నం, ఇంకోవైపు అజయ్ కుమార్ వేటలో ఇంటెలిజెన్స్ బృందం బయలుదేరడంతో ఆసక్తి పెరుగుతుంది. ఒకప్పుడు అజయ్ సహాయకులుగా ఉన్నవాళ్లే అతన్ని ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు? అసలు అజయ్ కుమార్ కి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని నుంచి అతను బయటపడ్డాడా లేదా అన్నదే మిగిలిన సినిమా.
విశ్లేషణ…
ఓ టాప్ క్లాస్ యాక్షన్ థ్రిల్లర్ కి అద్దం పట్టేలా వివేగం ని తీర్చిదిద్దడానికి దర్శకుడు శివ ప్రయత్నించాడు. అయితే ఈ తరహా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పటికీ అందులో కమర్షియల్ సినిమాలోకనిపించే సెంటిమెంట్ సహా అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ఈ విషయంలో శివని ఒకందుకు మెచ్చుకున్నా ఇంకొకందుకు తప్పు బట్టక తప్పదు. ఆ రొటీన్ సీన్స్ తగ్గి ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్ళేది. అయితే మాస్ పల్స్ ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే శివ కథ, కధనం నడిపించాడు. అయితే శివ మార్క్ ఎడిటింగ్ అక్కడక్కడా పేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది.
ఇక హీరో అజిత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లోను కనపడుతుంది. అజిత్ అంటే తమిళ తంబీలు ఎందుకంత పడి చచ్చిపోతారో అర్ధం అవ్వాలంటే వివేగం చూడాలి. నటన, యాక్షన్ ఎపిసోడ్స్ లో అజిత్ టాప్ క్లాస్ అని వేరే చెప్పక్కర్లేదు. ఇక హీరోయిన్ కాజల్, ఈ సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చిన కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ బాగా చేశారు. టెక్నికల్, నిర్మాణ విలువల విషయంలో కూడా వివేగం అందర్నీ మెప్పిస్తుంది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ …“వివేకం”కనిపించినా మూస తప్పడం లేదు.
తెలుగు బులెట్ రేటింగ్ …3 /5 .