భారీ ఇబ్బందుల్లో పడిన వొడాఫోన్‌ ఐడియా

భారీ ఇబ్బందుల్లో పడిన వొడాఫోన్‌ ఐడియా

సుప్రీంకోర్టు తీర్పుతో వొడాఫోన్‌ ఐడియా భారీ ఇబ్బందుల్లో పడింది.వడ్డీలు, లైసెన్సు ఫీజు బకాయిలపై జరిమానాలు తీసి వేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వాన్ని సాయం కోసం సంప్రదించాలనే ఆలోచనలో ఉంది. నిపుణులు మాట్లాడుతూ ఒక వేళ ప్రభుత్వం నుంచి సాయం అందక పోతే కంపెనీ మునిగి పోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు పలు ఆర్థిక చిక్కులకు దారి తీస్తుందని కంపెనీ భావించి ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఊరట కోసం డీఓటిని సం‍ప్రదించే ఆలోచనలో ఉన్నామని తెలియ చేసింది. గురువారం ప్రకటించిన సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కంపెనీ ముందు సాగడానికి చాలా ప్రశ్నార్థకంగా మారినాయి.

ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఈక్విటీలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%వాటా ఉండగా బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌నకు 43%వాటా ఉన్నది. వొడాఫోన్‌ ఐడియా కలిసే సమయంలో రెండు కంపెనీలు 25000కోట్ల రూపాయలు రైట్స్‌ ఇష్యూ కింద ఈక్విటీ పెట్టుబడులు అందించాయి. అదనపు నిధులు మరిన్ని పెట్టుబడిగా పెట్టదానికి ప్రధాన ప్రమోటర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ రెండు సంస్దల ముందుకు కొనసాగడం కష్టమే అన్నట్టు ఉంది.