అంగరంగ వైభవంగా నటి అర్చన వివాహం

అంగరంగ వైభవంగా నటి అర్చన వివాహం

నటి అర్చన వివాహం జగదీశ్ భక్తవత్సలంతో గురువారం తెల్లవారు జామున వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగింది. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా జగదీశ్ వ్యవహరిస్తున్నాడు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి ఇంకా ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అర్చన కొన్ని సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ కూడా చేసింది.

అర్చన బిగ్బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్లలో కూడా ఉంది. శాస్త్రీయ నర్తకిగా దేశ విదేశాల్లో అర్చన అనేక ప్రదర్శనలు ఇచ్చింది. కుటుంబం సభ్యులు, సన్నిహితుల మథ్య జరిగిన వివాహంకి  తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అథితుల కోసం వివాహ వేడుకకు ముందు ఘనంగా రిసెప్షన్‌ను నిర్వహించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయిన అర్చన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించారు.