వీఆర్‌ఏ భార్యపై వీఆర్వో గురి… ఇంటికెళ్లి మరీ కోరిక తీర్చాలంటూ…

20-year-old- girl gang-rape-in-chittoor

తెలంగాణలో కరోనా.. లాక్ డౌన్ వేళల్లో మనుషుల మధ్య పైత్యం ఎక్కువైపోయింది. తాజాగా కరీంనగర్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వీఆర్‌ఏ భార్యపై కన్నేసిన వీఆర్వో కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. నిత్యం ఏదో ఒక పని అప్పజెప్పి వీఆర్‌ఏని బయటికి పంపించి.. అతని భార్యని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో వేధింపులు భరించలేక పోయిన బాధితురాలు కరీంనగర్ జిల్లా పోలీసులను ఆశ్రయించింది. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని గోపాల్ పూర్, దుర్శేడ్, వల్లంపహాడ్, ఇరుకుల్ల గ్రామాల బాధ్యతలు చూసే వీఆర్వో రాజమల్లు తన కింద పనిచేస్తున్న వీఆర్‌ఏ భార్యపై కోరికను పెంచుకున్నాడు. నిత్యం ఏమి పనిలేకపోయినప్పటికీ.. వీఆర్‌ఏ ఇంటికి వెళ్లి అతని భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఏదో ఒక పని పురమాయించి వీఆర్ఏని బయటికి పంపించి తన కోరిక తీర్చాలంటూ అతని భార్యను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొనడం సంచలనం రేపుతోంది.

అయితే చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నప్పటికీ.. మౌనంగానే భరించామని బాధితురాలు తెలిపింది. అయితే ఈ వేధింపులు మరీ శృతి మించిపోవడంతో కరీంనగర్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా విషయం తెలుసుకున్న వీఆర్వో రాజమల్లు పరారైనట్లు సమాచారం. లైంగిక వేధింపులకు పాల్పడిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్ విషయాన్ని తొక్కిపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాగా వీఆర్వోపై విచారణ జరిపించి చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా  సమాచారం అందుతుంది. కాగా ఈ ఘటనపై అధికారులు… బాధితుల మధ్య తీవ్రమైన ఆరోప ప్రత్యారోపనలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.