“విశ్వంభర గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారా?”

"Waiting for vishwambara glimpses?"
"Waiting for vishwambara glimpses?"

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ మూవీ “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి నేడు మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దీనికి ఫ్యాన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈరోజు చాలామంది మూవీ గ్లింప్స్ ను కూడా ఆశించారు. కానీ మేకర్స్ అందుకు కొంచెం సమయం ఉందంటూ మొదట ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాత్రం వదిలారు.

"Waiting for vishwambara glimpses?"
“Waiting for vishwambara glimpses?”

మరి ఈ గ్లింప్స్ ఎప్పుడు విడుదల అయ్యే ఛాన్స్ ఉందో ఇప్పుడు బజ్ బాగా వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ వినాయక చవితి కానుకగా ఈ మూవీ తాలూకా అవైటెడ్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. దీనితో ఈ సెప్టెంబర్ మొదటి వారం లోనే విశ్వంభర విజువల్ ట్రీట్ రానుంది అని చెప్పొచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సింది. ఇక ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.