సూపర్‌మార్కెట్ తరహాలో మద్యం దుకాణాలు వాక్‌ఇన్ లిక్కర్ షాపులు రాబోతున్నాయి.ఈ వాక్‌ఇన్ లిక్కర్ షాపులకి అనుమతులిస్తూ ప్రభుత్వం ఎక్సైజ్ నోటిఫికేషన్ ద్వారా గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది.మద్యం ప్రియులు వెళ్లి స్టోరంతా తిరిగి ఇష్టమైన మద్యంబ్రాండ్లను ఎంచుకోవచ్చు.ఇలా ఎక్కువవిస్తీర్ణంలో రాబోతున్న వాక్‌ఇన్ వైన్ షాపుల వల్ల మద్యంప్రియులకు ఇంకా కిక్ ఎక్కబోనున్నది.
వాక్‌ఇన్ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునేవారు 2.30కోట్ల రూపాలని మొత్తంగా ఫీజు ఇంకా లైసెన్సు ఫీజుతో పాటు అదనంగా మరో 5లక్షలు స్పెషల్‌ఎక్సైజ్ పన్నుకు చెల్లించాలి.ఇప్పటికే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు ఉన్న హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో మరింత మత్తెక్కించేలా షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాల్లోనూ కొత్త షాపులు రానున్నాయి.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక్క స్పెన్సర్స్ మాల్‌లోనే వాక్‌ఇన్ వైన్స్ తరహలో ఒక మద్యం షాప్ ఉంది.దరఖాస్తు రుసుమును లక్ష నుండి రెండు లక్షలకు పెంచిన ప్రభుత్వ ఎక్సైజ్‌శాఖ ఈ నెల 9 నుంచి దరఖాస్తులు తీసుకుని 18 నుండి లాటరీ తీయనున్నారు