ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. విజయవాడ భవానీపురం లేబర్ కాలనీలో గోడలో బాలుడు ఇరుక్కుపోయాడు. చాట్రగడ్డ సోమయ్య కుమారుడు ఐన నిరంజన్ వయస్సు 6 సంవత్సరాలు. ఆడుకుంటూ తనయింటికి.. పక్కింటికి మధ్య ఉన్న గోడలో ప్రమాదవశాత్తు ఇరుక్కు పోయాడు. దాంతో ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితులలో ఉన్న తరుణంలో వెంటనే సమాచారం అందుకున్న భవానీపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు చలపతి ఎస్సై కవితశ్రీ అక్కడకు చేరుకొన్నారు.
అయితే వారు ఎంతో సాహసంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చాకచక్యంగా ఆ బాలుడను ప్రమాదం నుంచి కాపాడారు. దీంతో ఆ బాలుడి కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. బిడ్డ పుట్టినంత ఆనందంతో సంతోషాన్ని పొందారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఆలస్యం చేయకుండా వేగంగా స్పందించి వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణహానిని అరికట్ట గలిగారు. అయితే ఆరేళ్ల బాలుడు నిరంజంని కాపాడడంలో భవానీపురం పోలీసులు స్పందించిన తీరుపట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.