‘వార్-2’ సినిమా షూటింగ్ నిలిపివేత.. అసలు కారణం ఇదే!

'War-2' Movie Shooting delayed: Do you know the reason?
'War-2' Movie Shooting delayed: Do you know the reason?

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర, వార్-2 మూవీ ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు . ఈ మూవీ ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవల దేవర షూటింగ్‌లో ఎన్టీఆర్ చేతికి గాయం అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు వార్-2 సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి వెళ్లాడు.

'War-2' Movie Shooting delayed: Do you know the reason?
‘War-2’ Movie Shooting delayed: Do you know the reason?

రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్స్‌లో ఈ షూటింగ్ జరగాల్సి ఉన్నది . ఇక ఈ మూవీ ను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, కియారా అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్‌గా నటిస్తుంది .