టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా సంక్రాంతికి రిలీజ్ అయి మంచి టాక్, కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కనుక సెకండ్ హాఫ్ లెంగ్త్ కొంచెం తగ్గించి ఉంటె సరిలేరు ఏ రేంజ్ లో సూపర్ హిట్ టాక్ కొట్టేదో అర్ధం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ మేనియాతో ఇప్పటికే రూ.112 కోట్లకుపైగా కలెక్షన్ కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని దాటేసింది. ఇక మరోవైపు అలవైకుంఠపురములో సినిమా కూడా బాగానే కలెక్షన్స్ రాబడుతుండడంతో రెండు సినిమాల నిర్మాతలు ప్రస్తుతం కలెక్షన్ విషయమై విడుదల చేస్తున్న పోస్టర్లతో ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి.
ఈ విషయమై రెండు రోజులుగా భారీ ఎత్తున మహేష్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తారా స్థాయిలో యుద్ధం జరుగుతోంది. అయితే మరోవైపు సరిలేరు నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర నిన్న ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, తమతో పాటు రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమా కూడా మంచి క్రేజ్, కలెక్షన్స్ తో దూసుకుపోవడం మంచిదేనని, అయితే తాము సరిగ్గా కలెక్షన్స్ ప్రకటించిన సమయానికే వారు కూడా ప్రకటించడం జరిగిందని, దానివలన రెండు సినిమాల కలెక్షన్స్ విషయమై కొద్దిపాటి వాడివేడి చర్చ జరుగుతోందని అన్నారు. నిజానికి ఆ సినిమా ఓవర్సీస్ లో బాగా ఆడుతోందని, త్రివిక్రమ్ గారి మార్క్ ఆ సినిమాకు అక్కడ మరింత కలిసి వచ్చిందని అన్నారు. ఆ విషయం అటుంచితే, అలవైకుంఠపురములో యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్లలో చేసిన ఒక చిన్న తప్పిదమే ఇప్పుడు బన్నీని, ఆయన ఫ్యాన్స్ ని అడ్డంగా బుక్ చేసింది.
సరిగ్గా ఆరు రోజులకుగాను తమ సినిమా రూ.104 కోట్ల షేర్ వసూలు చేసిందని పోస్టర్ వదిలిన అల యూనిట్, మొత్తం వారం రోజుల్లో కలిపి రూ.180 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు నేడు మరొక పోస్టర్ రిలీజ్ చేసింది. అనంతరం ఆ మూవీ పిఆర్ టీమ్, మొత్తం వారం రోజులకు గాను తమ అలవైకుంఠపురములో సినిమా రూ.118 కోట్ల షేర్ దక్కించుకున్నట్లు ఏరియా వైజ్ గా లెక్కలు రిలీజ్ చేసింది. అయితే ఇక్కడే పెద్ద చిక్కుల్లో పడింది అల యూనిట్. నిజానికి ఆరు రోజులలోనే రూ.104 కోట్ల షేర్ వసూలు చేసిందని చెప్తున్న యూనిట్ సభ్యులు, కేవలం ఒక్కరోజులోనే రూ.14 కోట్లు అదనంగా, అంటే రూ.118 కోట్ల షేర్ వచ్చినట్లు చెప్తున్న లెక్కలన్నీ కూడా పక్కా ఫేక్ అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.