సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎంపీ అసరుద్దీన్ మధ్య ట్విట్టర్ లో వార్

సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎంపీ అసరుద్దీన్ మధ్య ట్విట్టర్ లో వార్

ఎంఐఎం ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎంపీ అసరుద్దీన్ మధ్య ట్విట్టర్ లో వార్ జరుగుతోంది. ఎంపీ అసరుద్దీన్, ఇరాన్ పరిణామాలు, జిహాద్ వంటి అంశాలు, దిశ హత్య కేసు నిందితులు మొదలైన విషయాలపై ట్విట్టర్ లో కొన్ని ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్ అమెరికన్ కంపెనీల్లో జీహాదీలు పనిచేస్తున్నారా అంటూ ఒక నెటిజన్ సీపీ సజ్జనార్ కు ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు సీపీ సజ్జనార్ స్పందించారు. అవును అంటూ సజ్జనార్ తన స్పందనను వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థల గురించి సమాచారం సేకరించేందుకు తమ దగ్గర అత్యాధునిక వ్యవస్థ ఉందని సజ్జనార్ ట్వీట్లలో తెలిపారు. ఎంపీ సజ్జనార్ ఇచ్చిన సమాధానం పట్ల ఎంపీ అసరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసరుద్దీన్ ఓవైసీ ఎంతమంది జీహాదీలు హైదరాబాద్ లో ఉన్నారో చెప్పాలని సజ్జనార్ కు ట్వీట్ చేశారు.

ఒకవేళ మీ దగ్గర జీహాదీలకు సంబంధించిన సమాచారం లేకపోతే అవును అని సమాధానం ఇవ్వటం వెనుక ఉద్దేశం చెప్పాలని అసరుద్దీన్ ప్రశ్నించారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతారా లేక మీ భక్తులకు మాత్రమే సమాధానం చెబుతారా అని వ్యంగ్యంగా అసరుద్దీన్ ట్వీట్లు చేశారు. ఎంపీ అసరుద్దీన్ దిశ ఎన్ కౌంటర్ గురించి కూడా ట్వీట్లలో ప్రస్తావించారు.

ఉదయం 5 గంటల సమయంలో ఎన్ కౌంటర్ ఎలా చేస్తారని అసరుద్దీన్ ప్రశ్నించారు. కొన్ని సందర్భాలలో థర్డ్ డిగ్రీలను కూడా ఒప్పుకోవచ్చని కానీ బుల్లెట్లను ఎన్ కౌంటర్ ద్వారా కడుపులో దింపటాన్ని ఎలా సమర్థిస్తామని అసరుద్దీన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సీపీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.