ఎమ్మెల్యే రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే మరియు ఏపీఐసీసీ చైర్మన్ రోజా సెల్వమని తెలుగు చిత్ర ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ ల మధ్య ఒకనాడు ఓ వార్తా వేదికన ఎలాంటి యుద్ధం నడిచిందో యావత్తు తెలుగు ప్రేక్షకులకు తెలుసు. భగవంతునిలా కొలిచే తన బాస్ పవన్ కళ్యాణ్ ను ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఒక్క మాట కూడా పడనివ్వరని బండ్ల అప్పుడు మరోసారి ప్రూవ్ చేసారు. అప్పుడు బండ్ల గణేష్ మరియు రోజాల మధ్య జరిగిన మాటల యుద్ధం అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉండగా ఇప్పుడు బండ్ల రోజాపై పెట్టిన ఒక ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బండ్ల గణేష్ ఇది వరకే ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలలో తన వ్యాపారం అయిన పౌల్ట్రీ కోసం అలాగే గుడ్ల కోసం వాటి ఆవశ్యకతను తెలిపేవారు. ఇప్పుడు అలాగే కరోనా కారణంగా రోజా తన ఇంట్లోనే ఉండి తమ కుటుంబ సభ్యులకు చికెన్ వండుతూ ఇలాంటి సమయంలో చికెన్ మరియు గుడ్ల అవసరం ఎంత ఉందో చెప్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోను పెట్టి ఆమెకు ధన్యవాదాలు తెలుపగా.. బండ్లయేనా ఈ ట్వీట్ చేసింది అంటూ నెటిజన్స్ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు.