సహజంగా సీరియల్ కిల్లర్ స్టోరీలను సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే సైకోయిజంతో వచ్చిన సినిమాలు కూడా చూస్తుంటాం. ఇది అన్నింటికంటే భిన్నమైంది. కానీ.. అలాంటి టూల్ ఉన్న స్టోరీనే. నిజమైన స్టోరీ. ప్రత్యక్షంగా జరిగిన నేరం. క్రైమ్. వరంగల్ గొర్రెకుంట బాదిత కథ. ఇద్దరు మనుషుల మధ్య సహజీవన, బంధం.. ఆపై వంకర చూపు.. దాన్ని నిలదీయడంతో ఓ హత్య. ఆ హత్యను కప్పిపుచ్చుకొనేందుకు మరో ఆరు హత్యలు.. అలాగే.. సాక్ష్యం లేకుండా చేసేందుకు మరో మూడు హత్యలు. టోటల్ గా 10. ఈ హత్యలన్నీ చేసింది ఒక్కడే సంజీవ్ కుమార్ యాదవ్. ఈ క్రైమ్ స్టోరీ గొర్రెకుంటలో మొదలైంది ఇక్కడే ఒక గోదాంలో పని చేస్తోంది మక్సూద్ కుటుంబం. ఆ కుటుంబం మొత్తం సభ్యుల్లో ఆరుగురు బాలికలు.
అయితే నాలుగేళ్లుగా పరిచయం ఉన్న మరో వ్యక్తి సంజీవ్ కుమార్ యాదవ్. బెంగాల్ నుంచి వచ్చిన అతను ఒంటరివాడుగా గుడుపుతున్నాడు. దీంతో మక్సూద్ మరదలు రఫీకాకు కొంత డబ్బులు ఇచ్చి అతడు అన్నం వండించుకొని తినేవాడు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి సహజీవనం వరకు వచ్చి అలా సాగుతూ ఉంది. అప్పటికే రఫీకాకు ముగ్గురు పిల్లలు. భర్త లేడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేయసాగాడు సంజయ్.