కేరళలోని కొచ్చిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కత్తిపోట్లకు దారితీసింది. ఇంటర్ నుంచే నడుస్తున్న ప్రేమ వ్యవహారం బయటకు పొక్కడంతో ప్రియుడి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రియురాలి అన్నకి ఎఫైర్ తెలిసిపోవడంతో కోపంతో రగిలిపోయాడు. దళితుడన్న కారణంతో చెల్లెలి ప్రియుడిపై కక్ష పెంచుకున్నాడు. కత్తితో దారుణంగా పొడిచేశాడు. అడ్డొచ్చిన అతని స్నేహితుడిపై కూడా దాడి చేశాడు. ఈ దారుణమై ఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకోవడంతో పెను ప్రకంపనలు రేగాయి.
అదేవిధంగా కొట్టాయం జిల్లా మువట్టుపుజాకి చెందిన అఖిల్ అదే ప్రాంతానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంటర్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం అఖిల్ ఎర్నాకుళంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. అయితే ప్రేమ వ్యవహారం ప్రియురాలి సోదరుడికి తెలిసిపోయింది. చెల్లెలు దళిత యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి అతడు రగిలిపోయాడు.
అతన్ని మర్చిపోవాలంటూ చెల్లెలిని తీవ్రంగా హెచ్చరించాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఏకంగా అన్న.. ప్రియుడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం తెలిసి జాగ్రత్తగా ఉండమంటూ అఖిల్‌ని ప్రియురాలు హెచ్చరించింది. అతను కూడా సీరియస్‌గా తీసుకోలేదు. మాస్కులు కొనుక్కొనేందుకు స్నేహితుడితో కలసి పట్టణంలోని మెడికల్ స్టోర్‌కి వెళ్లాడు. బైక్‌పై ఆ షాప్ వద్దకు వచ్చిన ప్రియుడి సోదరుడు అఖిల్‌ని బయటకు లాక్కొచ్చి దారుణంగా పొడిచేశాడు. కాగా కత్తితో పలుమార్లు దాడి చేయడంతో అఖిల్‌కి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తల, మెడ, చేతులపై విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడిని అడ్డుకొనేందుకు యత్నించిన అతని స్నేహితుడు అరుణ్ కి గాయాలయ్యాయి. వెంటనే అఖిల్‌ని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియురాలి సోదరుడితో బైక్‌పై వచ్చిన టీనేజర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.