ఐదు రోజుల నష్టాలకు చెక్

ఐదు రోజుల నష్టాలకు చెక్

ఎట్టకేలకు మార్కెట్ కోలుకుంది. వరుసగా ఐదు రోజుల నష్టాలకు చెక్ పెట్టింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు నేడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. టాప్ బ్యాంకుల మెరుగైన ఫలితాలతో నిఫ్టీ 50 ఇండెక్స్ పైకి జంప్ చేసింది. యాక్సిస్ బ్యాంకు షేరు 6 శాతానికి పైగా పెరిగింది. దీంతో పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆర్‌బీఎల్ బ్యాంకు, పీఎన్‌బీ, ఇండస్‌ఇండ్ బ్యాంకు, బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల షేర్లు ర్యాలీ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 366 పాయింట్లు పెరిగి 57,858.15 స్థాయిల వద్ద క్లోజైంది. నిఫ్టీ 50 కూడా 122 పాయింట్లు పెరిగి 17,271.95 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 247 పాయింట్లు పెరిగి 24,245.46 వద్ద, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 231 పాయింట్లు పెరిగి 28,869.33 వద్ద క్లోజయ్యాయి.

స్టెర్లైట్ టెక్నాలజీస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్)కు నెట్ వర్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందించడం కోసం రూ.170 కోట్ల కాంట్రాక్టును పొందినట్టు కంపెనీ ప్రకటించింది. అన్ని రీజనల్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లలో కంపెనీకి హై పర్‌ఫార్మెన్స్, ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కావాల్సి ఉంది. భారత్ ఇంటర్‌స్టేట్, ఇంటర్ రీజనల్ ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌మిషన్‌లో 90 శాతం వాటాను పీజీసీఐఎల్ కలిగి ఉంది.

ఇండియామార్ట్ ఇంటర్‌మెస్…సింప్లీ వ్యాపార్ యాప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సిరీస్ బీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌లో తాము పాల్గొనట్టు ఇండియామార్ట్ ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ రూ.217.6 కోట్లుగా ఉంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌ను ప్రస్తుత ఇన్వెస్టర్‌తో కలిసి వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నిర్వహించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత వ్యాపార్ వాల్యుయేషన్ సుమారు రూ.883 కోట్లుగా ఉంది. ఈ లావాదేవీలో భాగంగా ఇండియామార్ట్ రూ.61.55 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేపట్టింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ తర్వాత, వ్యాపార్‌లో ఇండియామార్ట్ 27 శాతం వాటా కలిగి ఉంది.

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మారుతీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, యూపీఎల్‌లు నేడు 3 శాతానికి పైగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో బ్లాక్ బాక్స్, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజస్ షేర్లు 6 శాతానికి పైగా పెరిగాయి.ఇలాంటి మరిన్ని వివరాల కోసం భారతదేశపు నెం 1 ఈక్విటీ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్‌ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్‌పై క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.