ప్రస్తుతం సమాజమంతా వాట్సాప్ తోనే నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో ముబైల్. అందులో వాట్సాప్ తప్పక ఉంటుంది. ఈ కాలంలో వాట్సాప్ వినియోగించని వ్యక్తి అంటూ దాదాపుగా లేడనే చెప్పాలి. ఐదు నిమిషాలకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ లను చెక్ చేసుకోకపోతే చాలా మందికి ఏదోలా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. వాట్సాప్ మెసేజ్ రాకపోతే కంగారు పడేవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారంటే నమ్మండి. అంతగా మనిషికి వాట్సాప్ చేరువైంది. తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారులకు అందించింది. అదేమంటే.. అదే అందులో పేమెంట్స్ ఆప్షన్.
అయితే ఈ ‘పేమెంట్స్’ ఆప్షన్ ద్వారా వాట్సాప్ నుంచి నగదును పంపుకోవడం, గ్రహించడం వంటి వాటిని తీసుకొచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ ఆప్షన్ పై ట్రయల్స్ వేసిన వాట్సాప్… చివరకు పేమెంట్స్ ఆప్షన్ ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను తన రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన బ్రెజిల్ లో మాత్రమే అందుబాటులోకి తేవడం విశేషం. అయితే రానున్న రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరింప జేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తుంది.