లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ మూవీ లో రిలీజ్ కు వచ్చిన సినిమా ల్లో వెంకీ మామ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. అయితే ఈ మూవీ తో తన కెరీర్లో మరో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి టాలీవుడ్ కి హిట్ మెషీన్ లా మారారు.
అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయ్యిన ఎమోషనల్ మూమెంట్ లో తనో పోస్ట్ షేర్ చేసుకున్నారు. పదేళ్ల కితం “పటాస్” మూవీ రిలీజ్ అయ్యింది. అది నా జీవితాన్నే మార్చేసింది. దర్శకునిగా మాత్రమే కాకుండా ఇలా ఈరోజు నేనిలా ఉన్నాను అంటే అందుకు మూల కారణం ఆ మూవీ నే అని తెలిపారు.
అలాగే వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతీ మూమెంట్, ప్రతీ క్షణం, ప్రతీ సవాలు పాఠం నేర్పించాయి అని తన జర్నీలో భాగమైన సన్నిహితులకి కుటుంబానికి తనమీద నమ్మకం పెట్టుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఈ పదేళ్లు పూర్తయ్యిన సందర్భంగా ఇదే ఎంటర్టైన్మెంట్ ని తాను కొనసాగిస్తూ మంచి మూవీ లు అందించే ప్రయత్నం చేస్తానని అనీల్ రావిపూడి ప్రామిస్ చేస్తున్నారు. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారిపోయింది .
https://x.com/AnilRavipudi/status/1882456526587302365