‘భూభారతి’ చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేస్తామని, ధరణితో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సోమవారం చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నాలుగు మం డలాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని జూన్ 2 నుంచి ఇక్కడి భూసమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ‘భూభారతి’తో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మంత్రి హామీ ఇచ్చిరు.

