Weather Report: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచి వాతావరణంలో మార్పు

Weather Report: Good news for people of Telangana.. Change in weather from Ellundi
Weather Report: Good news for people of Telangana.. Change in weather from Ellundi

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి ఒక్క చోట 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందింది.

భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు ఉపసంహణం కలిగించేలా ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయి. ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.