ఏపీ, తెలంగాణ రాష్ట్రలలో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది.
ఇవాళ చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైయస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, మెదక్, సిరిసిల్లా, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక అటు తెలంగాణ, ఏపీ లోని కొన్ని ప్రాంతాలలో… ఉదయం చలిగా, మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటోంది.