వెస్ట్ బెంగాల్ విద్యార్థిని రితి సాహ అనుమానస్పద మృతి కేసు విశాఖలో సంచలనం రేపుతోంది. గత నెల 14 వ తేదీన కాలేజీ అవరణలో అనుమానస్పద స్థితిలో రితి సాహ(16) మృతి చెందింది. దీంతో సెక్షన్ 174 ఐపిసి కింద కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం లో కాలేజీ యాజమాన్యం వద్ద 3 లక్షలు రూపాయలు పోలీసులు లంచం తీసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ తరుణంలోనే ఈ కేసులోకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంట్రీ ఇచ్చారు. సీఎం మమత బెనర్జీ ఆదేశాలతో ఏపీకి బెంగాల్ అధికారులు వచ్చారు. ఈ ఇష్యూపై ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ డీజీపిని వివరాలు అడిగి తెలుసుకున్నారు వెస్ట్ బెంగాల్ అధికారులు. సీపీ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో గొప్యంగా దర్యాప్తు జరుగుతోంది. పోలీస్ లు లంచం తీసుకున్నారని ఆరోపణపై సీపీ త్రివిక్రమ వర్మ సీరియస్ అయ్యారట. బాధితులతో నేరుగా మాట్లాడిన సీపీ త్రివిక్రమ వర్మ…. 4 వ పట్టణ పోలీసులు లంచం తీసుకోవడం సీసీ కెమెరాలు లో రికార్డ్ అయిందని మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు