ప్రస్తుతం మెగా హీరోల అభిమానులు ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. రీసెంట్ గాన్ వచ్చిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఊహించని విధంగా విఫలం అయ్యింది. ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి “ఓజి”, “హరిహర వీరమల్లు” మూవీ లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నిజానికి పవన్ మూవీ ల్లో ఓజి సినిమా గత ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన “దేవర” రిలీజ్ డేట్ లో రావాల్సి ఉన్నది .
కానీ అపుడు ఓటిటి డీల్ ముగియపోకపోవడం మూలాన అక్కడ నుంచి మేకర్స్ తప్పుకున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే ఇపుడు ఇదే తరహాలో పవన్ సోదరులు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ వండర్ సినిమా “విశ్వంభర” పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ కి కూడా ఇంకా పెండింగ్ పనులు కొన్ని బాకీ ఉండడం అలాగే ఓటిటి డీల్ కూడా అనుకున్న ఫిగర్ లో కాకపోవడంతో విశ్వంభర రిలీజ్ కొంచెం సస్పెన్స్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉన్నది .