ఇండియన్ బ్రాడ్ పిట్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ పై అయితే మళ్ళీ సస్పెన్స్ నడుస్తుంది. ఆల్రెడీ దీపావళి కానుకగా అనౌన్స్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదని రూమర్స్ మొదలు కాగా అసలు సాంగ్ ఎందుకు రావట్లేదు అనే దానిపై క్లారిటీ తెలుస్తోంది .
అయితే మేకర్స్ ఈ సాంగ్ ని సింగర్ ని మార్చడం వల్లే అన్నట్టుగా ఈ ఆలస్యం అని తెలుస్తుంది. మరి దీనిపై మాత్రం ఫ్యాన్స్ ఓ అధికారిక క్లారిటీని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందించగా అంజలి మరో హీరోయిన్ గా నటించింది. అలాగే నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా దీనిని నిర్మాణం వహిస్తున్నారు.