రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో తెలంగాణకు ఏం సాధించారు..

When the Congress party came to power, the eyes became bloodshot - Harish Rao
When the Congress party came to power, the eyes became bloodshot - Harish Rao

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. తెలంగాణకు సాధించింది ఏం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. వారి జీవితాలతో ఆడుకుంటుందని హరీష్‌రావు మండిపడ్డారు.