గవర్నర్ గో బ్యాక్ అంటామని ఏం అనుకోవద్దని అన్నారట !

గవర్నర్ గో బ్యాక్ అంటామని ఏం అనుకోవద్దని అన్నారట !

దేవుడు …పెద్దల ఆశీసులు…లక్ తనకు ఉన్నాయని నమ్ముతున్నారన్నారు  గవర్నర్ నరసింహన్ .తనకు ఎటువంటి ఎజెండా లేదని …అంతరాత్మ ప్రభోదం ,రాజ్యంగానికి లోబడి పనిచేసానన్నారు నరసింహన్ .తాను గవర్నర్ గా సక్సెస్ అయ్యానా …ఫెయిల్యూర్ అయ్యానా అన్నది చరిత్ర నిర్ణయిస్తుందన్నారు.శేష జీవితం చెన్నైలో సాదారణ పౌరుడిగా సాగిస్తాన్నారు నరసింహన్.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ , ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసి మంచి జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నట్టు నరసింహన్ అన్నారు. చత్తిస్ గడ్ నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా వచ్చినప్పుడు హైదరబాద్ లో కర్పూ ఉందన్నారు నరసింహన్. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ,సంఘాలు రాష్ట్లంలో శాంతికి సహకరించాయని అన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు ఒక్క తూట పేల్చలేదని ఆ సమయంలో వారు బాగా పనిచేసారని కితాబిచ్చారు నరసింహన్ .

ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు గవర్నర్. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిందన్నారు. ఉమ్మడి ఎపి అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో జరిగిన  సంఘటనలను ముందే ఊహించాను అన్నారు నరసింహన్. ఎక్సట్రా బడ్జెట్ కాపీ ,మైక్ ,పూర్తి బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసి తర్వాతే బయటకు రావాలని డిసైడ్ అయి వెళ్లానన్నారు.

తనతో రాజ్ భవన్ లో హోళీ అడిన తర్వాత కొంత మంది రాజకీయ నాయకులు బయటకు వెళ్లి గవర్నర్ గో బ్యాక్ అంటామని ఏం అనుకోవద్దని తనను కోరారని చెప్పారు నరసింహన్. తాను చెన్నైలో శేషజీవితాన్ని సాధారణ వ్యక్తిగా గడుపుతానని చెప్పారు నరసింహన్ .గవర్నర్ పదవికంటే ముందే ఎలా జీవితం గడిపానో అటువంటి జీవినాన్ని కొనసాగిస్తానని అన్నారు  .గవర్నర్ గా ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని అన్నారు .తాను   సక్సెస్ అయ్యానా …ఫెయిల్ అయ్యానా అన్నది చరిత్ర నిర్ణయిస్తుందన్నారు గవర్నర్.