రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఎడి ఇప్పటికే మూవీ లవర్స్ లో ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ మూవీ కోసం ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది.
కాబట్టి ఈ చిత్రానికీ అంత బడ్జెట్ కేటాయించడంపై హీరో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. కల్కి మూవీ గ్లోబల్ ఆడియెన్స్ కోసం రూపొందించామని.. అందుకే ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ అయ్యిందని ప్రభాస్ తెలిపారు. ఈ సినిమాలో చాలా మంది గొప్ప నటీనటులు ఉన్నారని తెలిపారు.ఇక ఈ మూవీ చూసిన తరువాత మరో ప్రపంచాన్ని వీక్షించిన అనుభూతి కలుగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు . ఈ మూవీ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లనుందని ఆయన వ్యక్తం చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పటానీ, పశుపతి తదితరులు నటిస్తున్నారు.