Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కొత్త అవతారంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు వెండి తెరపై ఆకట్టుకున్న కమల్ హాసన్ తాజాగా బుల్లి తెరపై ‘బిగ్‌బాస్’ షోతో అరించేందుకు సిద్దం అయ్యాడు. గత రెండు నెలలుగా తమిళ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్’ షో నిన్నటి నుండి ప్రారంభం అయ్యింది. ఈ షోలో పలువురు తమిళ యువ నటీనటులు పాల్గొంటున్నారు. హాట్ బ్యూటీ నమిత కూడా ఈ షోలో పాల్గొంటుండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
మొదటి ఎపిసోడ్లో కమల్ హాసన్ ఉషారుగా పార్టిసిపెంట్స్‌ను పరిచయం చేయడం జరిగింది. కమల్ హాసన్ ముందు ముందు మరింత ఆకట్టుకునే విధంగా ఈ షోను నిర్వహిస్తాడనే నమ్మకం ఉందని తమిళ సినీ ప్రముఖులు భావిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బిగ్ బాస్’ షోను తెలుగు మరియు తమిళంలో తీసుకు రాబోతున్నారు. కమల్ హాసన్ తమిళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్‌తో తెలుగులో స్టార్ మాటీవీ బిగ్ బాస్ షోను చేస్తుంది. వచ్చే నెలలో లేదా ఆగస్టులో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ను ప్రసారం చేసే అవకాశం ఉంది.