బేబీ సినిమాకి వైష్ణవి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఆనంద్ దేవరకొండ, అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ‘బేబి’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సాయి రాజేశ్ గారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

మీకు నమ్మసక్యం కావట్లేదు కదా నిజమండి ఆయనే .యువతకు, లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుండటంతో థియేటర్లు నిండిపోతున్నాయి. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రను పోషించాడు. ప్రస్తుతం వీరు ముగ్గురి పారితోషకం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే విజయ్ దేవరకొండకు రూ. 80 లక్షలు, వైష్ణవికి రూ. 30 లక్షలు, విరాజ్ అశ్విన్ కు రూ. 20 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది.