ఎమ్మెల్సీ కవితను ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం, ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా కవిత కేజ్రీవాల్ లకు ఈడి ఉచ్చు బిగిస్తోందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి.
ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో వాక్యానించిన విషయం తెలిసిందే. ఆమెను రెండు నెలలు జైలులో పెట్టి…ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. బిజేపి, సిఎం కెసిఆర్ ఇద్దరు నాటకాలు అడుతున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.